NRPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ పట్టణం నీలి జెండాలతో ముస్తాబైంది. సమానత్వ దినోత్సవంగా ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన కృషిని కొనియాడారు.