SRPT: మునగాల మండలం తాడువాయి గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో, గ్రామంలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలన్న అడుగు బయట పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం క్రితం ఇదే సమయంలో గ్రామం మొత్తం విష జ్వరాలతో అల్లాడిపోగా, ప్రస్తుతం కూడా విష జ్వరాలు వస్తున్నాయని ఇవాళ ఒక ప్రకటనలో ప్రజలు వాపోయారు.