NTR: విజయవాడ ఎనికేపాడలో రాబోయే రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ స్పోక్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పరచిన 62 స్టార్టప్ స్టాళ్లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఐటీ, ఎకో టెక్, డ్రోన్స్, వెస్ట్ రీసైక్లింగ్ సొల్యూషన్లను రూపొందిస్తున్నారని తెెలిపారు.