MDK: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. రామాయంపేట మండలం సుతార్ పల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారి పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. ఫీవర్ సర్వే పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మండల వైద్య అధికారి హరి ప్రియకు సూచించారు.