MLG: ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం మండలం బోధపురం, తిప్పాపురం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రొబేషనరీ ఎస్సైలు సాయి కృష్ణ, తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అనుమానిత వ్యక్తుల వాహనాలను తనిఖీ చేసి వివరాలను సేకరిస్తున్నారు.