E.G: రాజమండ్రిలోని 26వ క్లస్టర్, 50వ వార్డు, మెడికల్ కాలేజీ రోడ్లో శుక్రవారం పిచ్చి మొక్కల తొలగింపు, కాలువల పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. నీరు నిలిచిపోవడాన్ని నివారించడంతో పాటు, వర్షపు నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే RMC లక్ష్యంగా చర్యలు చేపట్టారు.