లార్డ్స్ టెస్టులో క్రీజ్‌లోకి వచ్చేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు 90 సెకన్ల ఆలస్యంగా రావడంపై టీమిండియా కెప్టెన్ గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా దీనిపై ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ స్పందించాడు. తాము కావాలని అలా చేయలేదని.. అనుకోకుండా జరిగిపోయిందని వెల్లడించాడు. తాము 90 సెకన్లు ఆలస్యమయ్యామనే విషయం తెలియదని కవరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.