మన్యం: అసంక్రమిక వ్యాధుల వ్యాప్తి, ప్రభావం, అంచనా, నియంత్రణకు వైద్యారోగ్యశాఖ మరింత పటిష్టంగా చర్యలు చేపట్టనుందని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎన్సీడీ వర్క్ షాప్‌కు జిల్లా నుండి ఎన్సీడీ వైద్య బృందం హాజరయ్యారు.