MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. తన సొంత ఖర్చులతో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం కోసం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నీటి శుద్ధి ప్లాంటును ఆయన ప్రారంభించారు.