GNTR: గుంటూరు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కొత్త గ్రీవెన్స్ సెల్, మీడియా గ్యాలరీ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా. ఎస్.వి. కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డా. జగదీశ్ చంద్ర పాల్గొన్నారు. ప్రజలతో మెరుగైన సంబంధాలకు ఈ సదుపాయాలు ఉపయోగపడతాయని, నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు.