MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని AE తిరుపతిరెడ్డి సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, స్వయంగా ఎవరు రిపేర్ పనులు చేయవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, రైతులు వ్యవసాయ పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలన్నారు.