VSP: విశాఖలో బంగారు ఆభరణాలతో పరారైన వ్యక్తిని శుక్రవారం హోటల్లో అరెస్ట్ చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. హైదరాబాదులోని నగల దుకాణంలో పనిచేస్తున్న వంశీ, జేజీ ఈనెల 4న విశాఖ వచ్చి పలు జూవెలర్స్ వద్ద ఆర్డర్లు తీసుకున్నారు. రూ.1.30 కోట్లు విలువ చేసే ఆభరణాలతో హోటల్ రూమ్లో బస చేశారని పేర్కొన్నారు.