GNTR: గుంటూరు నగరంలో హైదరాబాద్ తరహాలో పార్కులు ఏర్పాటు చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర నగర ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం కమీషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు నగర మేయర్, కమీషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు.