NGKL: లింగాల మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్ సంద్య విద్యార్థులను పరీక్షించి అవసరమైన వారికి చికిత్స, మందులను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఇందిరా, ఆశమ్మ, వార్డెన్ శివయ్య, హాస్టల్స్ సిబ్బంది పాల్గొన్నారు.