MDK: పెద్ద శంకరంపేట మహిళ సర్పంచ్ జంగం రేణుకను ఉప సర్పంచ్ రాజుగౌడ్ అన్ని విధాలుగా అగౌరపరుస్తున్నారని గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్ తో పాటు పంచాయతీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీకి తెలియకుండా ఉపసర్పంచ్ నల్ల కలెక్షన్లు ఆయనకు నచ్చిన వ్యక్తులకు ఇస్తున్నారని పేర్కొన్నారు. దోమల మందు స్ప్రే చేస్తున్నా కూడా చెప్పడం లేదని వాపోయారు.