ADB: ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం మునేశ్వర్ మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో ఐదు గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. చేతికొచ్చిన జీవాలు చనిపోవడంతో యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని, దాతలు ఆర్థికంగా చేయూతనివ్వాలని బాధితుడు వేడుకుంటున్నాడు.