MNCL: నేతకాని కుల వాస్తవ జనాభా సంఖ్యను వెంటనే అధికారిక గెజిట్లో చేర్చాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లిలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో నేతకాని కులస్తుల జనాభా సుమారు 15 లక్షలకుపైగా ఉన్నప్పటికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేలో 1.70లక్షల జనాభాను చూపించడం అన్యాయమన్నారు.