RR: పహాడీషరీఫ్‌లో ఈ-వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి. కర్ణన్ పరిశీలించారు. అనంతరం ఈద్గాను సందర్శించి ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. రాబోయే రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాను సందర్శించే భక్తులకు సరైన పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్యాన్ని నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.