NRPT: నారాయణపేట మండలం సింగారం గేట్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో అభిలాష్ (470కి 440), రామ్ చరణ్ (436) మార్కులతో రాణించగా, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో శివానంద్ (1000కి 912) మార్కులతో సత్తా చాటారు. బైపీసీ విభాగంలోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు.