KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం పడడంతో పలు పంటలు దెబ్బతిన్నాయని, రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.