SRPT: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేసి మాట్లాడారు. సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు.