సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. “ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్” అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో కొత్త రకం మెటీరియల్స్ ప్రాధాన్యతను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.