NRPT: జిల్లాలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు ASIలుగా పదోన్నతి పొందారు. ఇవాళ జిల్లా ఎస్పీ డా. వినీత్ వారికి “వన్ స్టార్” అలంకరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. పదోన్నతితో బాధ్యత పెరుగుతుందని, ప్రజలతో సానుభూతితో వ్యవహరించి న్యాయం చేయాలని సూచించారు. బాధ్యతాయుతమైన సేవలతో ప్రజల విశ్వాసం పొందాలని అధికారులను కోరారు.