BDK: నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని, ఆయన యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని కొత్తగూడెం మేయర్ గణేష్ అన్నారు. మంగళవారం సుజాతనగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.