నల్గొండ: పట్టణంలో దేవాలయం హుండీ పగలగొట్టి, స్కూటీ, సెల్ ఫోన్లు దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న రాత్రి అయ్యప్ప గుడిలో ఈ చోరీ జరిగింది. సాంకేతిక సమాచారంతో నిందితుడు పొలిశెట్టి కార్తీక్ కుమార స్వామిని సావర్కర్ నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక స్కూటీ, ఒక ఆటో, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.