టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సంస్థ తన క్యాబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ధేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించాలని యోచిస్తోంది. సంస్థ ప్రతిష్టను, సేవల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను కఠినతరం చేసింది.