ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మనదేతల సన్నిధికి నేడు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం నేడు ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగులో స్నానం ఆచరించి, సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లనున దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న చెట్ల కింద గడుపుతూ వనభోజనాలు చేస్తున్నారు.