మహేష్ బాబు,రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ కాశీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్‌లలో చిత్రీకరించనున్నట్లు టాక్. కాగా, ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.