SRD: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. మల్కాపూర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీలకు 25 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ పాల్గొన్నారు.