HNK: క్రీడా రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మార్కెట్ ఛైర్ పర్సన్ ఝాన్సీరాణి అన్నారు. అంబాల, గూడూరు, కమలాపూర్ శనిగరం గ్రామాల మీదుగా నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడల్లో రాణించాలని ఛైర్ పర్సన్ సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.