NZB: సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో శుక్రవారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి భక్తులు 108 రకాల వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక్కో రకం ప్రసాదాన్ని తీసుకువచ్చి, ఈ మహా నైవేద్యాన్ని తయారు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.