NRML: వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన ఆత్మ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.