PDPL: అంతర్గాం మండలం పెద్దంపేటలో ఆదివాసీల ఆధ్వర్యంలో లక్ష్మీదేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు మహేష్ పాల్గొని నిర్వాహకులకు కండువాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనవాస సమయంలో పంచపాండవులు ఈ గ్రామానికి వచ్చారని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.