GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం ప్రాజెక్టులోకి 87,351 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు నాలుగు గేట్లను తెరిచి, దిగువకు 27,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, పవర్ హౌస్కు 39,802 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 872 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు.