MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు.