SRPT: మునగాల మండలంలోని జాతీయ రహదారులపై, సర్వీస్ రోడ్లపై గ్రామ శివారులోని రోడ్లపై ధాన్యం ఆరవేస్తూ.. వాహనదారుల, సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడరాదన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారులపై మార్గమధ్యంలో రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టరాదని తెలిపారు.