TPT: వేసవి దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను నీటి గుంతల్లో స్నానాలకు పంపవద్దని గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ సూచించారు. ఈ మేరకు నీటి గుంతల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా విద్యార్థులు స్నానాల కోసం ఆటవిడుపుగా నీటి గుంతలో ఆడుకునే అవకాశం ఉందని ఇది గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపవద్దన్నారు.