CTR: 28న పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్‌తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తారని స్పష్టం చేశారు.