SRPT: తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ కె.నరసింహ కోరారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందనీ అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు.