MBNR: జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్లమెంట్ అధికారిక ప్రకటన జారీ చేశారు. ఎంపవర్ ఆఫ్ ఉమెన్ కమిటీని 30 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. తెలంగాణ నుండి కమిటీ సభ్యురాలుగా డీకే అరుణ నియామకం కాగా, చైర్ పర్సన్‌గా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నియమితులయ్యారు.