ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని తుమ్ముకుంటకు చెందిన గుఱ్ఱపూసల వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి అర్బన్ కాలనీ నుంచి తుమ్ముకుంటకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి దాడి చేసినట్లు బాధితులు తెలిపాడు. స్థానికులు గాయాలపాలైన వెంకటేశ్వర్లను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై శనివారం బాధితుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.