ప్రకాశం: పెద్దారవీడు మండలం గుండంచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న కాటమరాజు గంగాభవాని స్వామి దేవస్థానం భూములను సర్వే చేయించాలని కమిటీ సభ్యులు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆలయానికి ప్రస్తుతం ఉన్న రోడ్డు వెలుగొండ ప్రాజెక్టు ముంపులో ఉన్నందున బి. చెర్లోపల్లి శివాలయం నుంచి కలనూతల వరకు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.