ELR: కొల్లేరును 5 నుండి మూడో కాంటూరుకు కుదించి ఉపాధి, అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వం అక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరరావు అన్నారు. కొల్లేరు గ్రామాల్లో శనివారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు బృందం విసృత పర్యటన చేశారు. మాధవాపురం పక్షుల కేంద్రం, పెద ఎడ్లగాడి వద్ద కొల్లేరు ప్రాంతాన్ని బృందం పరిశీలించింది.