ELR: పెయింటింగ్ పనులు చేస్తున్న పెయింటర్‌కు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఏలూరు 1వ పట్టణ పరిధిలో సుబ్రహ్మణ్యం కాలనీలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు పోతునూరుకు చెందిన లింగాల పరశురాం(31)గా గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి ముత్తయ్య ఇంట్లో పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.