SRPT: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చివ్వెంల మండలం గుంజలూరు వద్ద చోటు చేసుకుంది. స్కూటీపై రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి దాసాయిగూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.