MBNR: రూరల్ మండలం దిగుటిపల్లి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగను మహబూబ్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 25.9 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి వెల్లడించారు. బంగారాన్ని జడ్చర్లలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడు పట్టుబడినట్లు పేర్కొన్నారు.