బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం వరంగల్లో భారీ సభ జరగనుంది. ఈ సభ చరిత్ర సృష్టించబోతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సభ ఏర్పాట్లపై KTR సమీక్షించారు. కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొందని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని పిలుపునిచ్చారు.