ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు టోల్ ప్లాజా సమీపంలో సంతమాగులూరు సిఐ వెంకటరావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మత్తు పదార్థాలు గంజాయి అక్రమ రవాణాను ఆపేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లుగా సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనాలదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.