ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన అజీజ్ 6 ఎకరాల జొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత రైతు పంట పొలాన్ని ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.