WGL: భద్రకాళి అమ్మవారి ఆలయం పౌర్ణమి సందర్భంగా గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణతో విశేష పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.